- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: బీఆర్ఎస్‌లో ఉన్న ఆ ముగ్గురు పక్కా జైలుకెళ్తరు: రఘునందన్ రావు సెన్సెషనల్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మరోవైపు అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య అభివృద్ధిపై పరస్పర ఆరోపణలతో క్యాంపెయిన్ హీటెక్కుతోంది. బహిరంగ చర్చలకు సిద్ధమంటూ నాయకులు సవాళ్ల మీద సవాళ్లు విసురుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో ఇప్పటికే అడ్రస్ లేకుండా పోయిందని, ఆ పార్టీలో ఉన్న కేటీఆర్, హరీష్ రావు, వెంకట్రామి రెడ్డి ముగ్గురూ పక్కా జైలుకెళ్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో ప్రజలకు ఏం చేశారో చెప్పాలంటూ ప్రశ్నించారు. ప్రాజెక్టుల పేరుతో కల్వకుంట్ల కుటుంబం రూ.లక్షల కోట్లు దోపిడీ చేసి తెలంగాణ ప్రజలను మోసం చేసిందంటూ ఫైర్ అయ్యారు. ఆ విషయంలో దమ్ముంటే బీఆర్ఎస్ పెద్దలు తనతో చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మేదక్ పార్లమెంట్ స్థానంపై బీజేపీ జెండా ఎగువేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో ఎన్ని పార్టీలు ఏకమైనా.. మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాని అవ్వడం ఖాయమని రఘునందన్ రావు తేల్చి చెప్పారు.