- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసిన కేసీఆర్‌కు, రేవంత్‌కు తేడా లేదు.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై నమ్మకం లేకనే ప్రభుత్వాన్ని నడిపేందుకు ఇతర పార్టీల నుంచి రేవంత్ రెడ్డి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ మోసపూరిత పార్టీలేనని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజలు కాంగ్రెస్ పాలన పట్ల పూర్తిగా విశ్వాసం కోల్పోయారని అన్నారు. ఇతర పార్టీల గుర్తులపై గెలిచిన వారిని పార్టీలో చేర్చుకుంటూ.. నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి చట్టాలను పాతరేసేలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసిన కేసీఆర్‌కు.. రేవంత్‌రెడ్డికి పెద్దగా తేడా ఏమి లేదంటూ కిషన్‌రెడ్డి ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.