- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: మోడీ పాలనలో అన్నింటిపైనా పన్నులే: మంత్రి సీతక్క ఘాటు వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో అన్నింటిపైనా పన్నులు వేసి దేశ ప్రజల నడ్డి విరుస్తున్నారని మంత్రి సీతక్క ఆరోపించారు. ఇవాళ హనుమకొండ జిల్లా మలడికొండలో నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఓ నమ్మకం, గ్యారెంటీ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలను ఆత్మగౌరవంతో బలికేలా చేసింది కాంగ్రస్ మాత్రమేనని అన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎన్నో గోసలు పడ్డామని తెలిపారు.
ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా బీఆర్ఎస్ పని చేసినందుకే ఆ పార్టీని ప్రజలు ఇంటికి పంపిచారని అన్నారు. మోదీ చేసిందేమి లేకపోవడంతోనే కాంగ్రెస్‌పై తప్పుడు విమర్శలు చేస్తున్నారన్నారని ఆరోపించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి తప్పుడు విమర్శలు చేయడం తగునా అని ప్రశ్నించారు. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే కాంగ్రెస్ పార్టీ ఆహార భద్రత, ఉపాధిహామీ, విద్యాహక్కు వంటి చట్టాలను తీసుకొచ్చిందని గుర్తు చేశారు. జీఎస్‌టీ పేరిట కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను లూఠా చేస్తుందని ఆరోపించారు.