- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BREAKING: ఆరు గ్యారంటీలే.. ఆ పార్టీ పాలిట భస్మారుస హస్తం అవుతుంది : మాజీ మంత్రి హరీష్ రావు
దిశ, వెబ్‌డెస్క్: ఆరు గ్యారంటీలే.. ఆ పార్టీ పాలిట భస్మారుస హస్తం అవుతుందని, కాంగ్రెస్ పచ్చి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలు రాష్ట్రంలో ఎక్కడ అమలు అయ్యాయో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా సాధ్యం కాని హామీలతో ఆ పార్టీ ఊదరగొట్టిందని, ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రజలను మోసం చేసేందుకు హస్తం పార్టీ ప్రయత్నిస్తోందని అన్నారు. పార్టీ కార్యక్రమాలే సీఎం రేవంత్ రెడ్డికి ముఖ్యమైపోయానని ఆరోపించారు. మార్కెట్ యార్డుల్లో రైతుల ధాన్యం తడిస్తే.. పరామర్శించాల్సింది పోయి, పార్టీ బహిరంగ సభల్లో ఊకదంపుడు ఊపన్యాసాలు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజా పాలనను సీఎం రేవంత్ రెడ్డి గాలికొదిలేశారని ఆరోపించారు. ఆరు గ్యారంటీలే ఆ పార్టీ పాలిట భస్మారుస హస్తం అవుతుందని హరీష్ రావు ధ్వజమెత్తారు.