BREAKING: రైతులకు తీరని అన్యాయం చేసిన గత ప్రభుత్వం: ఎంపీ మల్లు రవి ఘాటు వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-07-19 09:54:21.0  )
BREAKING: రైతులకు తీరని అన్యాయం చేసిన గత ప్రభుత్వం: ఎంపీ మల్లు రవి ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్ రైతులకు తీరని అన్యాయం చేసిందని ఎంపీ మల్లు రవి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌లోని గాంధీ‌భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. వందల ఎకరాలు ఉన్న ఆసాములకు కూడా రూ.కోట్లలో రైతుబంధు ఇచ్చారని ఆరోపించారు. అలా మాజీ సీఎం కేసీఆర్ రూ.వందల కోట్లను వృథా చేశారని ఆక్షేపించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైన రైతులకు మాత్రమే మేలు చేస్తుందని గుర్తు చేశారు. రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం రుణమాఫీ చేయదంటూ విపక్షాలు ప్రచారం చేశాయని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో కూడా వారు అసత్య ప్రచారం చేయడంతో బీజేపీకి కొన్ని సీట్లు ఎక్కువ వచ్చాయని స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా రైతులు నిలబడి అఖండ విజయాన్ని అందిస్తారని ఆకాంక్షించారు.

Advertisement

Next Story

Most Viewed