BREAKING: వాడపల్లి చెక్‌పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీలు.. రూ.9.5 లక్షల నగదు స్వాధీనం

by Shiva |
BREAKING: వాడపల్లి చెక్‌పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీలు.. రూ.9.5 లక్షల నగదు స్వాధీనం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. రాష్ట్ర సరిహద్దులు, చెక్‌పోస్టులు అనే తేడా లేకుండా అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని ఆపి క్షుణ్ణంగా పరిశీలించాకే ముందుకు పంపుతున్నారు. పోలీసు శాఖ మొత్తం ఎలక్షన్ కమిషన్ ఆధినంలో ఉండటంతో ఎక్కడ ఎలాంటి పొరపాటు జరిగినా.. తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇప్పటికే ఉన్నతాధికారులు వారికి దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ నల్లగొండ జిల్లా దామచర్ల మండల పరిధిలోని వాడపల్లి చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన ఓ కారును ఆపి చెక్ చేయగా.. అందులో రూ.9.5 లక్షల నగదును కనుగొన్నారు. లభించిన నగదుకు కారులో ఉన్న వ్యక్తులు సరైన పత్రాలు చూపకపోవడంతో పోలీసులు రూ.9.5 లక్షల క్యాష్‌ను సీజ్ చేశారు.

Advertisement

Next Story