BREAKING: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చిన మోడీ.. రిజర్వేషన్లను ఎలా రద్దు చేస్తారు: కాంగ్రెస్‌కు ఈటల రాజేందర్ కౌంటర్

by Shiva |   ( Updated:2024-05-10 12:53:26.0  )
BREAKING: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చిన మోడీ.. రిజర్వేషన్లను ఎలా రద్దు చేస్తారు: కాంగ్రెస్‌కు ఈటల రాజేందర్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ.. రిజర్వేషన్లను ఎలా రద్దు చేస్తారని కాంగ్రెస్‌కు ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న 76 కేంద్ర మంత్రి పదవుల్లో 26 పదువులు బీసీలకే కట్టబెట్టారని పేర్కొన్నారు. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించన ఘనత మోడీకే దక్కుతుందని పేర్కొన్నారు. రిజర్వేషన్లను రద్దు చేస్తారని రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని తెలిపారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల సంఖ్య ఎంత ఉందో చెప్పాలంటూ కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. రాష్ట్రంలో బీజేపీ ఎంపీలను గెలిపిస్తే.. అభివృద్ధి జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. రైల్వే స్టేషన్ల నిర్మాణానికి మోదీ సర్కార్ ఇప్పటికే భారీగా నిధులు మంజూరు చేసిందన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎక్కువ సంఖ్యలో లేకపోయినా.. మోదీ తెలంగాణకు నిధులు కేటాయిస్తున్నారని గుర్తు చేశారు. దేశం సుభిక్షంగా, సురక్షితంగా ఉండాలంటే నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని కావాలన్నారు.

Advertisement

Next Story