- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
BREAKING: రైతుబంధు, రైతుభీమా డబ్బు కాజేసిన కొందుర్గు ఏఈవో.. పోలీసుల అదుపులో అధికారి

X
దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల పరిధిలో రైతుబంధు, రైతు భీమా పేరుతో డబ్బును కాజేసిన ఏఈవోను పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. కొందుర్గు మండల పరిధిలోని కొన్ని గ్రామాలకు ఇంచార్జ్‌గా సదరు అధికారి రైతులు చనిపోయినట్లుగా తప్పుడు ధృవ పత్రాలతో రైతుబంధు, రైతు భీమా నిధులను మళ్లించినట్లుగా ఉన్నతాధికారులు గుర్తించారు. గత నాలుగేళ్లుగా 20 మంది రైతుల పేరుతో రూ.2 కోట్లు నిధులు కాజేనట్లుగా తెలుస్తోంది. ఎల్‌ఐసీ అధికారుల ఫిర్యాదుతో అసలు విషయం బయటపడింది. ఏఈవోతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా నిధులు కాజేసినట్లు ఒప్పుకున్నారని సైబరాబాద్ పోలీసులు తెలిపారు.
Next Story