BREAKING: పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం చేసిన కేసీఆర్: మీట్ ది ప్రెస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి

by Disha Web Desk 1 |
BREAKING: పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం చేసిన కేసీఆర్: మీట్ ది ప్రెస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్ తన పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసాన్ని చేశారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హైదారాబాద్‌లో తాజ్ కృష్ణలో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన పాల్గొ్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎన్నికలు ఎన్డీఏ, ఇండియా కూటమికి మధ్య జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు జరిగిన లోక్‌సభ ఎన్నికలు అన్ని అభవృద్ధి, సంక్షేమం చుట్టూ నడిచాయని పేర్కొన్నారు. కానీ, ప్రస్తుతం ఎన్నికల్లో అభివృద్ధి సంక్షేమం పక్కదోవ పట్టాయని దుయ్యబట్టారు. భారత రాజ్యాగమే భగద్గీత, ఖురాన్, బైబిల్‌తో సమానమని.. బలహీనవర్గాల అభ్యున్నతికి తోడ్పడేలా రాజ్యాగాన్ని రచన జరిగిందన్నారు. అందులో కేంద్ర, రాష్ట్రల మధ్య అధికార విభజన స్పష్టంగా ఉందని రేవంత్ గుర్తు చేశారు. గడిచిన పదేళ్లలో కేంద్రంలో బీజేపీ అన్ని సంస్థలను చెరబట్టింది ఆక్షేపించారు.

రాజ్యాంగాన్ని మారుస్తామని మోడీ అంటున్నారని.. అలాంటి ప్రజల స్వేచ్ఛను హరించే పనని అడ్డుకోవాలనే లక్ష్యంతో ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తోందని తెలిపారు. ఈ క్రమంలో మతాలు, భాషలు, వ్యక్తుల మధ్య బీజేపీ విషాన్ని చిమ్ముతోందని పేర్కొన్నారు. దేశంలో అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి జరగలేదన్నారు. ఢిల్లీకి కూతవేటు దూరంలో ఉన్న యూపీకి పెద్దగా పెట్టుబడులు రాలేదని, అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్లే పెట్టుబడులు రాలేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెట్టుబడులకు కేంద్రంగా హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ వందేళ్ల విధ్వంసాన్ని సృష్టించారని ఆరోపించారు. ఒక బీజేపీ రాష్ట్రంలో అడుగు పెడితే.. సమాజం రెండుగా చీలిపోయే ప్రమాదం ఉందన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed