గవర్నమెంట్ జాబ్ వదులుకొని జబర్దస్త్‌లోకి వచ్చిన స్టార్ కమెడియన్.. అతనెవరంటే..?

by Kavitha |
గవర్నమెంట్ జాబ్ వదులుకొని జబర్దస్త్‌లోకి వచ్చిన స్టార్ కమెడియన్.. అతనెవరంటే..?
X

దిశ, సినిమా: ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో చాలా మందికి లైఫ్ ఇచ్చింది. ఈ షో ద్వారా ఎంతో మంది పాపులారిటీ సంపాదించుకున్నారు. అలా ఫేమస్ అయిన వారిలో వెంకీ మంకీ ఒకరు. ఈయన తన కామెడీ టైమింగ్స్, పంచ్‌లు, సటైర్స్ అన్నింటితో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాడు. అలా సుమారు పదేళ్లుగా ఈ కామెడీ షోలో కొనసాగుతున్నాడు వెంకీ మంకీ. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకీ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

ఆయన మాట్లాడుతూ.. ' నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను. అందుకోసం మంచి ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా వదులుకున్నాను. జబర్దస్త్ షో తో నా కల నెరవేరింది. నేను మామూలుగా ఒక మిమిక్రీ ఆర్టిస్టును .. అక్కడక్కడ షోస్ చేస్తూ ఉండేవాడిని. అదే సమయంలో చమ్మక్ చంద్ర చూసి నన్ను జబర్దస్త్‌కు ఇంట్రడ్యూస్ చేశాడు. కమెడియన్‌గా నాకు అక్కడ ఒక మంచి గుర్తింపు వచ్చింది. అయితే స్టార్టింగ్‌లో నేను డైరెక్టర్ కావాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను. స్క్రిప్ట్ రాయడంలో నాకు అంతో ఇంతో అనుభవం ఉంది. యాక్టింగ్ కూడా కొద్దిగా తెలుసు.

అందువలన జబర్దస్త్ కామెడీ షో లో ఎక్కువ కాలం నిలదొక్కుకోగలిగాను. 10 ఏళ్లపాటు టీమ్ లీడర్‌గా కొనసాగాను. నిజం చెప్పాలంటే జబర్దస్త్ నాకు జీవితాన్ని ఇచ్చింది. ఈ కామెడీ షో గురించి ఎవరేం మాట్లాడారనేది నాకు తెలియదు. నాకు అనవసరం కూడా.. కానీ ఆ కామెడీ షో నే మాకు కడుపు నింపి ఆదరించిందనే విషయాన్ని మరిచిపోకూడదు అనేది నా ఉద్దేశం' అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వెంకీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. నెటిజన్లు వాట్ గవర్నమెంట్ జాబ్ వదిలేసి ఈ రంగంలోకి వచ్చావా.. దండం సామి నీకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story