- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: నేను కమీషన్లు తీసుకున్నట్లుగా నిరూపిస్తే.. తక్షణమే రాజీనామా చేస్తా: పల్లాకు కడియం శ్రీహరి సవాల్
దిశ, వెబ్‌డెస్క్: రైతుబంధు, దళిత బంధు పథకాల్లో తాను కమీషన్లు తీసుకున్నట్లుగా నిరూపిస్తే.. ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేస్తానని కడియం శ్రీహరి సవాల్ విసిరారు. ఇవాళ ఆయన వరంగల్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తనపై మాజీ మంత్రి రాజయ్య, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పల్లా రాజేశ్వర్ రెడ్డ బీఆర్ఎస్ ప్రభుత్వ అండను చూసుకుని రూ.వందల కోట్ల అక్రమార్జనకు పాల్పడ్డారని అన్నారు.
లిఫ్ట్ ఇరిగేషన్ కాంట్రాక్టర్ వద్ద పల్లా రాజేశ్వర్ రెడ్డి రూ.104 కోట్ల మేర కమీషన్ తీసుకున్నారని ఆరోపించారు. ఆయనలా తాను అధికారాన్ని చూసుకుని వర్సిటీ, మెడికల్ కాలేజీలు తెచ్చుకోలేదంటూ చురకలంటించారు. మనబడి-మన ప్రణాళిక కాంట్రాక్టులు కూడా పల్లా తమ్ముడికే ఇప్పించుకున్నారని ఆరోపించారు. ఇక గతంలో స్టేషన్ ఘన్‌పూర్ విషయానికి వస్తే.. దళితబంధు పథకంలో రాజయ్య పెద్ద ఎత్తున కమీషన్లు తీసుకున్నారని పేర్కొన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ పలు స్టేషన్లలో కేసులు కూడా నమోదు అయి ఉన్నాయని అన్నారు.