- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BREAKING: భూమి లేని రైతు కూలీలకు భారీ గుడ్ న్యూస్.. ఇక నుంచి వారికి ఏడాదికి 12 వేలు
దిశ, వెబ్‌డెస్క్: 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇవాళ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన గ్రామాల్లో భూమి లేని నిరుపేద రైతులకు భారీ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. రాష్ట్రంలో చివరి రైతు వరకు సంక్షేమ ఫలాలు అందలనేదే సర్కార్ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆర్థిక భద్రత కరువై పని దోరకని రోజుల్లో రైతు కూలీలు పస్తులుండాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వారి మరింత దుర్భరంగా తయారైంది. వారందరినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టుబోతోంది. రైతు కూలీల ఆర్థిక, జీవన స్థితిగతులు మెరుగు పరిచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా భూమిలేని రైతు కూలీలకు సంవత్సరానికి రూ.12 వేలు అందిస్తామని పేర్కొన్నారు. అయితే, పథకానికి ఈ సంత్సరంలోని శ్రీకారం చుట్టుబోతున్నట్లుగా మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.