బ్రేకింగ్ : కొడుకు పెళ్లి మండపంలోనే మాజీ రౌడీ షీటర్ అరెస్ట్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-10 06:22:14.0  )
బ్రేకింగ్ : కొడుకు పెళ్లి మండపంలోనే మాజీ రౌడీ షీటర్ అరెస్ట్!
X

దిశ,మేడ్చల్ టౌన్: కొడుకు పెండ్లి మండపం‌లో తండ్రిని అరెస్ట్ చేసిన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. జవహర్ నగర్ ప్రాంతానికి చెందిన మాజీ రౌడీ షీటర్ ఎరుకల శ్రీను కొడుకు వివాహం నగరంలోని నాగోల్ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ జరుగుతుండగా పోలీసులు మండపానికి చేరుకున్నారు.

3 సంవత్సరాల క్రిందట మేడ్చల్ జాతీయ రహదరికి అనుకొని ఉన్న ఓ వెంచర్‌లోకి వెళ్లడానికి యత్నించడాని, ప్రైవేట్ వ్యక్తుల భూమిని కబ్జా చేసి రోడ్డు వేసుకున్నారని ఆరోపణ‌పై గతంలో మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి గురువారం ఎరుకల శ్రీను కొడుకు వివాహం జరుగుతుండగా మేడ్చల్ పోలీసు వివాహ మండపం చేరుకొని సినీ పక్కిలో అరెస్ట్ చేశారు .

ఓ మంత్రి ,ఎమ్మెల్యే ఆదేశాలతో శీను అరెస్ట్..?

ఎరుకల శ్రీను అరెస్ట్ వెనుక రాజకీయ కోణం ఉందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఓ మంత్రి, ఎమ్మెల్యే ఆదేశాలతో సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. యంటిసిపేటరీ బెయిల్ ఉన్న కూడా పోలీసులు ఏమాత్రం పట్టించుకోకుండా శ్రీను అరెస్ట్ చేశారని వారు చెప్పారు.

ఎరుకల శ్రీను అరెస్ట్ వాస్తవమే: మేడ్చల్ సీఐ రాజశేఖర్ రెడ్డి

భుకబ్జా కేసులో ఎరుకల శ్రీనును అరెస్ట్ చేసిన విషయం వాస్తవమేనని మేడ్చల్ సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం శ్రీనును రిమాండ్‌కి తరలించినట్లు సీఐ చెప్పారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.

Advertisement

Next Story