- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు వాట్సాప్ చాట్ బట్టబయలు.. ఫోన్ ట్యాపింగ్‌లో ఫోకస్ అంతా ఆ ఒక్కడిపైనే అని వెల్లడి!
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు ఆయనను పంజాగుట్ట పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే పోలీసుల విచారణలో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కేసుకు సంబంధించి ప్రతిపక్ష నాయకులు, పలు కీలక అధికారులతో పాటు బంధువుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. అయితే ప్రస్తుతం ప్రణీత్ రావుకు సంబంధించిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్లు బయటకు వచ్చాయి.
బీఆర్‌ఎస్ పార్టీలో ఓ కీలక ప్రధాన నేత ప్రణీత్ రావును రాత్రికి రాత్రే 100 మంది నెంబర్లు ఇచ్చి ట్యాప్ చేయమనడం, వాటిని అతడు ట్యాప్ చేసినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీద వారంతా ప్రధానంగా ఫోకస్ పెట్టారని పోలీసుల విచారణలో వెల్లడైంది. రేవంత్ ఎప్పుడు ఎవరిని కలుస్తున్నారు.. ఏం చేస్తున్నారనే విషయాలపై ఆ బీఆర్ఎస్ నేత నజర్ పెట్టారని తెలిసింది. అదేవిధంగా ప్రధానంగా కాంగ్రెస్ నాయకులు ఎవరికి డబ్బు చేరవేస్తున్నారనే సమాచారన్ని కూడా ట్యాప్ చేసిన బీఆర్ఎస్‌లోని ముఖ్య నేతకు తెలిపినట్లగా తెలుస్తోంది. అదేవిధంగా రేవంత్ రెడ్డితో పాటు ఆయన అనుచరుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్లుగా విచారణలో వెల్లడైంది. రాష్ట్రంలో పేరుగాంచిన రెండు మీడియా సంస్థ అధినేతల ఫోన్లు ట్యాపింగ్ గురయ్యాయని టాక్.