BREAKING: పార్టీని వీడి దొంగలతో కలిసేటోళ్ల గురించి బాధలేదు: మాజీ సీఎం కేసీఆర్ సెన్సేషనల్ కామెంట్స్

by Shiva |   ( Updated:2024-06-28 13:29:41.0  )
BREAKING: పార్టీని వీడి దొంగలతో కలిసేటోళ్ల గురించి బాధలేదు: మాజీ సీఎం కేసీఆర్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్న వేళ ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. పార్టీని వీడి దొంగలతో కలిసేటోళ్ల గురించి తమకు ఏమాత్రం బాధ లేదని అన్నారు. శుక్రవారం ఎర్రవల్లి ఫాంహౌజ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ కొత్త నాయకులను తయారు చేస్తుందని.. నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరని అన్నారు. నాడు అయినా.. నేడు అయినా నాయకులను తయారు చేసుకున్నది పార్టీనే అని గుర్తు చేశారు. మెరికల్లాంటి యువ నాయకులను పార్టీ సృష్టిస్తుందంటూ కామెంట్ చేశారు. తెలంగాణ సాధించిన తమకు అదో లెక్క కాదని అన్నారు. రెట్టించిన ఉత్సాహంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దామని నాయకులకు, కార్యకర్తలకు కేసీఆర్ పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed