బ్రేకింగ్ : గజ్వేల్‌లో నామినేషన్ దాఖలు చేసిన CM KCR

by Sathputhe Rajesh |   ( Updated:2023-11-09 07:29:36.0  )
బ్రేకింగ్ : గజ్వేల్‌లో నామినేషన్ దాఖలు చేసిన CM KCR
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ గజ్వేల్‌లో నామినేషన్ దాఖలు చేశారు. గజ్వేల్ సమీకృత భవనంలో సీఎం కేసీఆర్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ అనంతరం అక్కడున్న ప్రజలకు సీఎం అభివాదం చేశారు. ప్రచార రథంపై హెలిప్యాడ్ చుట్టూ తిరుగుతూ ప్రజలకు సీఎం కేసీఆర్ అభివాదం చేశారు. ఇక, కామారెడ్డిలో సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 2 గంటలకు నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ అనంతరం కామారెడ్డిలో బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొననున్నారు. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. రేపటితో నామినేషన్ల గడువు ముగియనుండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్లు సమర్పిస్తున్నారు.

Advertisement

Next Story