BREAKING: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సర్వీసులు రద్దు.. టికెట్ కౌంటర్ వద్ద ప్రయాణికుల ఆందోళన

by Shiva |
BREAKING: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సర్వీసులు రద్దు.. టికెట్ కౌంటర్ వద్ద ప్రయాణికుల ఆందోళన
X

దిశ, వెబ్‌డెస్క్: మైక్రోసాఫ్ట్‌ సర్వర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రపంచ వ్యాప్తంగా విమాన తీవ్ర అంతరాయం కలిగింది. ఎక్కడికక్కడ ఆన్‌లైన్ టికెట్, బుకింగ్ సేవలు నిలిచిపోవడంతో జనజీవనం స్తంభించింది. ఈ క్రమంలోనే శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అన్ని విమాన సర్వీసులు రద్దు అయినట్లుగా ప్రకటించారు. అదేవిధంగా బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, గోవా, వైజాగ్, లక్నో, కోల్‌కతా వెళ్లవలసిన ఇండిగో విమాన సర్వీసులు ఎలాంటి సమాచారం లేకుండా రద్దు చేయడంతో టికెట్ కౌంటర్ల వద్ద ప్రయాణికులు ఆందోళనకు దిగారు. దాదాపు ఆరు గంటల నుంచి సిబ్బందితో వాగ్వాదానికి దిగుతూ పడిగాపులు కాస్తున్నారు.

Advertisement

Next Story