బ్రేకింగ్ : బండి సంజయ్ అరెస్ట్ (వీడియో)

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-19 07:39:47.0  )
బ్రేకింగ్ : బండి సంజయ్ అరెస్ట్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పేపర్స్ లీక్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ ఉద్రిక్తతకు దారి తీసింది. పదో తరగతి హిందీ పేపర్ లీక్ అనంతరం కరీంనగర్ లో అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత బండి సంజయ్ ఇంటివద్దకు పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అయితే నిన్న ఉదయం 9.45 కి పదో తరగతి హిందీ పేపర్ బయటకు రాగా రాత్రి 8.30 కి వరంగల్ సీపీ రంగనాథ్ ప్రెస్ మీట్ పెట్టి బండి సంజయ్ కి పేపర్ వెళ్లిందని ప్రకటించారు.

రాత్రి 11 గంటలకు బండి సంజయ్ ఇంటికి కరీంనగర్ పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. విషయం తెలుసుకున్న కార్యకర్తలు బండి ఇంటికి భారీగా చేరుకున్నారు. అర్థరాత్రి 12 గంటల తర్వాత ఇంటి దగ్గర హైడ్రామా చోటు చేసుకుంది. అర్థరాత్రి 12.30 గంటలకు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు ఉదయం 4 గంటలకు బొమ్మలరామారం స్టేషన్ కి తరలించారు. అర్ధరాత్రి తనను అరెస్ట్ చేయడంపై లోక్ సభ స్పీకర్ కార్యాలయానికి బండి సంజయ్ ఫిర్యాదు చేశారు. ఎలాంటి వారెంట్ లేకుండా అరెస్ట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అర్ధరాత్రి అక్రమంగా తన ఇంట్లోకి చొరబడి అరెస్ట్ చేశారని బండి సంజయ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి: కారణం చెప్పకుండా అరెస్ట్ చేయడం ఏంటీ? : ఈటల

Advertisement

Next Story