BREAKING : కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం

by Sathputhe Rajesh |   ( Updated:2024-04-24 14:06:51.0  )
BREAKING : కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే నల్లగొండ జిల్లా వేములపల్లి దగ్గర కేసీఆర్ కాన్వాయ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. కాన్వాయ్‌లోని 8 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అయితే కాన్వాయ్ లో ఉన్న వారికి ఏం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో కేసీఆర్ కాన్వాయ్ లోని పలు వాహనాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Read More...

వాళ్ల సంగతి చూద్దాం.. రైతులకు కేసీఆర్ భరోసా

Advertisement

Next Story