నిమజ్జనం ముగిసేదాకా కొట్లాటకు బ్రేక్ ఇయ్యండి: మంత్రి పొన్నం

by Y. Venkata Narasimha Reddy |
నిమజ్జనం ముగిసేదాకా కొట్లాటకు బ్రేక్ ఇయ్యండి: మంత్రి పొన్నం
X

దిశ వెబ్ డెస్క్ : వినాయక నిమజ్జనం అయ్యే వరకు రాజకీయ కొట్లాటలకు బ్రేక్ వేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ ఎస్ నాయకులకు సూచించారు. వినాయక నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పది సంవత్సరాలు అధికారంలో ఉండి అధికారం కోల్పోయాక అసహనంతో ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లే రీతిలో బీఆర్ ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని మంత్రి పొన్నం మండిపడ్డారు. పరిపాలించడం కాంగ్రెస్‌కు వెన్నతో పెట్టిన విద్య అని, శాంతిభద్రలను ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసన్నారు.హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా బీఆర్ ఎస్ రాజకీయం చేస్తుందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రలకు ఎవరు భంగం కలిగించినా.. అది మా పార్టీ వాళ్లైనా.. కేటీఆర్‌ అయినా, ఇతర బీఆర్ఎస్ నాయకులైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా ఎవరు వ్యవహరించినా సహించేది లేదన్నారు. పార్టీ ఫిరాయింపుల అంశం కోర్టులో ఉందని, దీనిపై ఏవరైనా రాజకీయపరమైన విమర్శలు చేయాలనుకుంటే నిమజ్జనం వరకు ఆగాలని కోరారు. వినాయక నిమజ్జనం అయ్యే వరకు రాజకీయ విమర్శలు, ఆందోళనలు వద్దని ఇప్పటికే డీజీపీ చెప్పారని, తాను కూడా అదే విషయం స్పష్టం చేస్తున్నానన్నారు.

Advertisement

Next Story

Most Viewed