- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుక్కల దాడిలో బాలుడి మృతి ఘటనపై హైకోర్టు సీరియస్
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో బాలుడు మరణించిన ఘటనపై హైకోర్టు సీరియస్ అయింది. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంతోనే బాలుడు చనిపోయాడని మండిపడింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. వీధి కుక్కలు పసిపిల్లల ప్రాణాలు తీస్తుంటే అసలు జీహెచ్ఎంసీ ఏం చేస్తోందని, ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని ప్రశ్నించింది.
తెలంగాణ చీఫ్ సెక్రటరీ, జీహెచ్ఎంసీ, హైదరాబాద్ కలెక్టర్, తెలంగాణ లీగల్ సేల్ అథారిటీ, అంబర్ పేట్ మున్సిపల్ అధికారికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. బాలుడి మృతి బాధాకరమని వ్యాఖ్యానించిన హైకోర్టు.. బాలుడు మృతికి నష్ట పరిహారం చెల్లింపు అంశాలను పరిగణలోకి తీసుకుంటామని పేర్కొంది. ఈ కేసులో తదుపరి విచారణను మార్చి 16కు వాయిదా వేసింది.