Apartment Lift: అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్‌లో ఇరుకున్న బాలుడు మృతి

by Ramesh N |
Apartment Lift: అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్‌లో ఇరుకున్న బాలుడు మృతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని ఓ (Apartment Lift) అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో ఇరుకుపోయి గాయపడ్డ బాలుడు అర్నవ్(6) మృతి చెందాడు. నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశాడు. శుక్రవారం (Masab Tank) మాసబ్‌ట్యాంక్ శాంతినగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో మూడో ఫ్లోర్ నుంచి కిందకు దిగే క్రమంలో ఒక్కసారిగా లిఫ్ట్ ఆగిపోడంతో.. లిఫ్ట్-స్లాబ్ మధ్య బాలుడు అర్నవ్ ఇరుకుపోయాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, డీఆర్ఎఫ్ సిబ్బంది బాలుడి రక్షించి నిలోఫర్‌ ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే.

దాదాపు 2 గంటల పాటు లిఫ్ట్‌లో ఇరుక్కుపోవడంతో పొట్ట, వెన్ను భాగంలో బాలుడికి తీవ్రంగా గాయాలైనట్లు వైద్యులు గుర్తించారు. అర్నవ్ కడుపు పూర్తిగా నలిగిపోవడంతో పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న లాపరోటమీ సర్జరీ చేసి వెంటిలేటర్‌పై బాలుడికి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో అర్నవ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, బాలుడి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Next Story

Most Viewed