అదేమైనా కేసీఆర్ సభనా..? ఎంపీల సస్పెన్షన్‌పై బూర కీలక వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-12-19 15:08:37.0  )
అదేమైనా కేసీఆర్ సభనా..? ఎంపీల సస్పెన్షన్‌పై బూర కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: పార్లమెంట్‌లో ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్ సరైన చర్య అని, పరిధి దాటితే వేటు తప్పదని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. అదేమైనా కేసీఆర్ సభ కాదు కదా అని ప్రశ్నించారు. మంగళవారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్‌లో ఫిల్మ్ స్క్రిప్ట్‌ల విపక్షాలు ఆందోళన చేస్తున్నాయన్నారు. ఇందులో పాత్ర దారులు.. కుట్ర దారులు ఎవరు అనేది తేల్చాలని దర్యాప్తు సంస్థలను స్పీకర్ ఆదేశించారన్నారు.

ప్రధాని, హోంమంత్రి దర్యాప్తు సంస్థల రిపోర్ట్ కోసం చూస్తున్నారన్నారు. ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వస్తేనే కదా..? హోంమంత్రి ఆన్సర్ ఇచ్చేదన్నారు. నిందితుడు చెప్పే సాకు మాత్రం నిరుద్యోగ సమస్య అని, కానీ ఈ కుట్ర వెనకాల బలమైన సూత్రధారులు ఉన్నారని ఆరోపించారు. వీరు దాడి చేసింది ఉద్యోగాల కోసం కాదు రాజకీయ నిరుద్యోగుల కోసం మాత్రమే అని మండిపడ్డారు. బీజేపీనీ చులకన చేసేందుకే ఈ ఘటన‌కు దిగారని ధ్వజమెత్తారు.

మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి డైవర్ట్ చేసేందుకే కాంగ్రెస్ ఈ నాటకాలు ఆడుతుందని విమర్శించారు. దొరికిన నిందితులు రైతు ఉద్యమాలతో పాటు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారని సమాచారన్నారు. కొవిడ్‌కు భయపడాల్సిన అవసరం లేదన్నారు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు. గత కోవిడ్ సమయంలో 220 కోట్ల వ్యాక్సిన్‌ను కేంద్రం ఇచ్చిందన్నారు. ప్రజల్లో రెసిస్టెంట్ పవర్ చాలా ఉందని తెలిపారు. దగ్గు జలుబు ఉన్న వాళ్ళు ఇంటికి పరిమితం కావాలని, మాస్క్ పెట్టుకుంటే కరోనాను నివారించుకోవచ్చని, రాష్ట్రం ప్రభుత్వం నిర్లక్ష్యం చేయొద్దని కోరారు.

Advertisement

Next Story

Most Viewed