కోమటిరెడ్డి శరీరం మాత్రమే బీజేపీలో.. ఆత్మ కాంగ్రెస్‌లోనే: మాజీ MP బూర

by Satheesh |   ( Updated:2023-10-25 09:39:51.0  )
కోమటిరెడ్డి శరీరం మాత్రమే బీజేపీలో.. ఆత్మ కాంగ్రెస్‌లోనే: మాజీ MP బూర
X

దిశ, వెబ్‌డెస్క్: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శరీరం మాత్రమే బీజేపీలో ఉందని.. ఆయన ఆత్మ కాంగ్రెస్‌లోనే ఉన్నదని భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ రాజీనామా చేయడంపై బూర స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోమటిరెడ్డి బీజేపీకి రాజీనామా చేయడం బ్రేకింగ్ న్యూస్ ఏమీ కాదని.. ఇది అందరూ ఊహించినదేనని అన్నారు. బీఆర్ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయం కాదని రాజగోపాల్ రెడ్డి అన్నది అవాస్తమన్నారు. ఆయన అనుకున్నాంత మాత్రాన అది కాదన్నారు.

రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నయం కేవలం బీజేపీ మాత్రమేనన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిల్లో జనాలు లేరని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను ప్రగతిభవన్ నుంచి ఖాళీ చేయించే పనిలో రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరు ఉన్నారన్నారు. నాకు భువనగిరి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని ఉందని.. కానీ పార్టీ అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానం తీసుకున్న ఏ నిర్ణయానికైనా శిరసా వహిస్తానని పేర్కొన్నారు.

Advertisement

Next Story