- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కాసేపట్లో కొలాప్స్’..ప్రజా భవన్ కు బాంబు బెదిరింపు
X
దిశ, డైనమిక్ బ్యూరో:హైదరాబాద్ లోని ప్రజాభవన్ బెదిరింపు కాల్ కలకలం రేపింది. కాసేపట్లో ప్రజాభవన్ పేలిపోతుందంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ కు మంగళవారం ఓ అగంతకుడు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్ ద్వారా తనిఖీలు చేపట్టారు. అయితే ఇది ఫేక్ కాల్ అని అధికారులు గుర్తించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్ చేసిన అగంతకుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా ఈ భవనం గతంలో ప్రగతి భవన్ గా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గా మారుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రజా భవన్ ముందు ఉన్న ఇనుప కంచెనలను కూడా తొలగించి వేశారు. ప్రస్తుతం ప్రజాభవన్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అధికారిక నివాసంగా కొనసాగుతోంది.
Advertisement
Next Story