- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎల్బీ స్టేడియంలో ఉర్రూతలూగించిన బాలీవుడ్ సింగర్.. ప్రత్యేక ఆకర్షణగా సమంత
దిశ, తెలంగాణ బ్యూరో: స్ట్రీట్ కాజ్ హైదరాబాద్ ఎన్‌జీవో ఆధ్వర్యంలో ఎల్‌బీ స్టేడియం వేదికగా ఆర్‌ఎఫ్‌సీ 9.0 పేరుతో జరిగిన బాలీవుడ్ సింగర్ అర్మాన్ మాలిక్ లైవ్ ఇన్ కాన్సర్ట్ వీక్షకులను ఉర్రుతలూగించింది. శనివారం హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో ఈ కాన్సర్ట్ రెండు గంటల ముందే వీక్షకులతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సింగర్ అర్మాన్ తన ప్రసిద్ధ పాటలైన బుట్ట బొమ్మ, కోపంగా, పెహ్లా ప్యార్ పాటలతో కాన్సర్ట్‌ను ప్రారంభిస్తూ తన పాటలతో వీక్షకులను ఓలలాడించారు. అర్మాన్ పాటకు ప్రజలు స్వరం కలుపుతూ, డాన్సులతో సరదాగా ఎంజాయ్ చేశారు. అర్మాన్ తన హిట్‌లైన బుట్టా బొమ్మా, మై హూన్ హీరో తేరా, హలో, సూరజ్ దుబా హై, ఏమైందో, పడి పడి లేచే, రెండు కళ్ళు, నిన్నిలా నిన్నిలా, విన్ననే విన్ననే, లబోన్ పే నామ్, జాన్ హై మేరీ రొమాంటిక్ వంటి పాటలతో అలరిస్తూ అందరినీ ఉత్సాహపరుస్తూ జోష్ నింపారు.
తన మ్యాజికల్ వాయిస్‌తో వీక్షక హృదయాలను దోచుకున్నాడు. స్ట్రీట్ కాజ్ ఇండియా సీఈఓ జి.రమ్య, సీఎఫ్‌ఓ ప్రవల్లిక, ప్రెసిడెంట్ శృతి మాట్లాడుతూ 2009లో ప్రారంభించినప్పటి నుంచి ఒక సంవత్సరంలోనే, సంస్ధ 15 వేలకు పైగా ప్రాజెక్ట్‌లు పూర్తి చేసిందన్నారు. ఇదిలా ఉండగా ఈ కాన్సర్ట్ లో నటి సమంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. త్వరలో రిలీజ్ కానున్న శాకుంతలం సినీ యూనిట్ గుణ శేఖర్, మ్యాజిక్ డైరెక్టర్ మణిశర్మ సైతం ఈ కాన్సర్ట్ కి హాజరయ్యారు. బ్యాండ్ క్యాప్రిషియో లైవ్ మ్యూజిక్ అలరించింది.