కళ్లకు గంతలు కట్టుకొని జూనియర్‌ డాక్టర్ల నిరసన.. ఎందుకంటే?

by Ramesh N |
కళ్లకు గంతలు కట్టుకొని జూనియర్‌ డాక్టర్ల నిరసన.. ఎందుకంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: పెండింగ్‌లో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా మెడికల్‌ కళాశాల జూనియర్‌ డాక్టర్లు నిరసన తెలిపారు. ఉపకార వేతనం కోసం జూనియర్ డాక్టర్ల నిరసన నాలుగో రోజుకు చేరుకుంది. ఇవాళ కళ్లకు గంతలు కట్టుకొని జూనియర్‌ డాక్టర్ల నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు దీపాంకర్ మాట్లాడుతూ.. అధికారుల చుట్టూ తిరగకుండా ప్రతి నెలా సకాలంలో స్టైఫండ్ ఇవ్వాలని ఎప్పటి నుంచో కోరుతున్నామని అన్నారు. కానీ, ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఉస్మానియా అసుపత్రి భవనం మూసి వేసి నాలుగేళ్లు అయ్యిందని, పక్కనే ఉన్న మరో భవనంలోకి ఆసుపత్రిని మార్చినట్లు గుర్తుచేశారు.

అయితే, విపరీతమైన రద్దీ కారణంగా ఇన్‌ఫెక్షన్ల శాతం పెరుగుతోందన్నారు. ఉస్మానియా కొత్త బిల్డింగ్ కట్టాలని డిమాండ్ చేశారు. డాక్టర్లపై దాడులను ఆపాలన్నారు. సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్లకు సవరించిన గౌరవ వేతనం నోటిఫికేషన్, వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రతా సమస్యలు పరిష్కారం, తగిన మౌలిక సదుపాయాల కల్పనకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లపై హామీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే 24 నుంచి సమ్మెను ప్రారంభించి నిరవధికంగా కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించారు.

Advertisement

Next Story

Most Viewed