'బండి' చేతులమీదుగా విముక్తి.. BJYM వినూత్న ప్రదర్శన

by GSrikanth |
బండి చేతులమీదుగా విముక్తి.. BJYM వినూత్న ప్రదర్శన
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ప్రస్తుతం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో కొనసాగుతోంది. ఆదివారం బీజేవైఎం నేషనల్ ట్రెజరరీ పీఎం సాయి ప్రసాద్ బండి సంజయ్‌కు ఘన స్వాగతం పలికారు. పాదయాత్ర నేపథ్యంలో బీజేవైఎం ఆధ్వర్యంలో ఓ వినూత్న కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ విమోచన దినాన్ని ప్రతిబింబించేలా ప్రజలకు విముక్తి కల్పిస్తున్నట్లు వినూత్న ప్రదర్శన చేశారు. నిజాం నుంచి ప్రజలకు విముక్తి కల్గిస్తున్నట్లు, సంకెళ్లు వేసుకొని వాహనానికి కట్టేసిన ఇద్దరిని బండి సంజయ్ చేతులమీదుగా విడిపించారు. అనంతరం సాయి ప్రసాద్ మాట్లాడుతూ... మల్కాజ్‌గిరిలో వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపని దీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ పుంజుకోవడాన్ని టీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతున్నదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ సర్కా్ర్ చరిత్రను వక్రీకరిస్తూ, విమోచన దినాన్ని రాజకీయం చేస్తోందని మండిపడ్డారు.




Advertisement

Next Story

Most Viewed