నీకు సగం.. నాకు సగం.. అంటూ కేసీఆర్, రేవంత్ పై బీజేపీ సోషల్ మీడియా సెటైర్లు

by M.Rajitha |
నీకు సగం.. నాకు సగం.. అంటూ కేసీఆర్, రేవంత్ పై బీజేపీ సోషల్ మీడియా సెటైర్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్, బీఆర్ఎస్ తీరు నీకు సగం నాకు సగం అన్నట్లుగా ఉందని బీజేపీ సోషల్ మీడియా విభాగం ఎక్స్ వేదికగా సెటైర్లు వేసింది. రేవంత్ రెడ్డిని ఇసుక ‘రవ్వంత’ లేనోడంటూ ఘాటు విమర్శలు చేసింది. పీసీసీగా ఉన్న సమయంలో ఇంతెత్తు మాట్లాడాడని, పవర్ రాగానే పబ్బం గడుపుతున్నాడంటూ పేర్కొంది. కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని, ఇగో జైలుకు, అగో జైలుకు అనుకుంటూ వగల మాటలు పలికాడని విమర్శలు చేశారు. పగ్గం అంది పవర్ రాగానే పైసలు పంచుకొని పబ్బం గడుపుతున్నాడంటూ ఘాటు విమర్శలు చేశారు.

Advertisement

Next Story