BJP Tweet : అల్లు అర్జున్ ఎపిసోడ్ లో బీజేపీ సంచలన ట్వీట్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-12-24 11:36:47.0  )
BJP Tweet : అల్లు అర్జున్ ఎపిసోడ్ లో బీజేపీ సంచలన ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్ : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన..అల్లు అర్జున్(Allu Arjun) అరెస్టు కేసు వివాదం నేపథ్యంలో తెలంగాణ బీజేపీ(BJP) ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ వైరల్(Tweet goes viral)గా మారింది. "చెయ్యి తడపాలి.. చిత్రం నడపాలి!" ..ఇదే కాంగ్రెస్ పార్టీ కొత్త నినాదం..అంటూ బీజేపీ రాష్ట్ర శాఖ ట్వీట్ చేసింది. బెనిఫిట్ షోలు బంద్ చేస్తాం..మాకు బెనిఫిట్ చేస్తే వదిలేస్తామంటూ ట్వీట్ లో బీజేపీ పేర్కోంది. ట్వీట్ కు అహ నా పెళ్ళంట సినిమాలో కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం పాత్రల మధ్య సన్నివేశంలోని వ్యంగ్య సంభాషణలు జత చేసింది.

రామాలయం కట్టేందుకు విరాళం కోసం వచ్చిన వారితో నాకేంటి అంటూ కోట మాట్లాడటం..కోట నాకేంటి వ్యాఖ్యల అర్థాన్ని బ్రహ్మానందం వివరిస్తూ మా అయ్యగారు బోరింగ్ పంపులాంటి వారని, బోరింగ్ పంపులో ముందు కొన్ని నీళ్లు పోస్తేనే నీళ్లు రావు కదా అని, చేతిలో కొంచెం బరువు పెడితేనే గాని అయ్యగారు ఎవరితో మాట్లాడరంటూ కోట స్వార్థ వైఖరిపై వ్యంగ్యోక్తులు విసురుతాడు. ఆ వ్యాఖ్యలను సీఎం రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డిలకు అన్వయిస్తూ బీజేపీ విమర్శనాత్మక ట్వీట్ చేసింది.

ఇప్పటికే బీజేపీ ఎంపీ డీకే అరుణ హీరో అల్లు అర్జున్ ను సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేయడం వెనుక అసలు మతలబు వేరే ఉందని.. అది త్వరలో తేలుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీకి సూట్ కేసులు పంపించే అంశంలో ఎక్కడో చెడిందని.. అందుకే అల్లు అర్జున్‌ను టార్గెట్ చేసినట్లు ఉన్నారంటూ బీజేపీ వైఖరిని చాటేలా అరుణ వ్యాఖ్యలు చేశారు.

Read More : అల్లు అర్జున్‌ పై వేధింపులకు కారణం అదే : డీకే అరుణ

Advertisement

Next Story

Most Viewed