- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పదవుల్లో ప్రయారిటీ వాళ్లకే.. బీజేపీ ‘కొత్త’ స్ట్రాటజీ!
దిశ, తెలంగాణ బ్యూరో: పార్టీలో కొత్త వారికి ప్రయారిటీ ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నది. మండల స్థాయి నుంచి మొదలుకుని రాష్ట్ర స్థాయి వరకు కొత్తగా చేరే వారికి అవకాశాలు ఇవ్వాలని అనుకుంటున్నది. దీని ద్వారా జాయినింగ్స్ ను పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్నది. పార్టీకి కొత్త తరం అవసరమని, పదవుల్లోనూ వారికి అవకాశం కల్పించాలని పార్టీ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఇప్పటికే పార్టీలో వర్గపోరు, పాత, కొత్త నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్న తరుణంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెంబర్ షిప్ డ్రైవ్ లో బీజేపీ 31 లక్షల పైచిలుకు సభ్యత్వాలను కంప్లీట్ చేసింది. ఇందులో 26 లక్షలకు పైగా ఆన్ లైన్ ద్వారా చేపట్టగా మిగతా 5 లక్ష వరకు సభ్యత్వాలు మిస్డ్ కాల్ ద్వారా వచ్చాయి. ఈ సమయంలో తన వ్యాఖ్యల ద్వారా కిషన్ రెడ్డి ఏం చెప్పాలనుకుంటున్నారని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కొత్త వారికి పదవులు ఇస్తే ఇన్ని రోజుల తమ కష్టం నీటిపాలేనా అని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పార్టీలో ఉన్న పాత నేతలను కాపాడుకోవడంపై జాగ్రత్తలు తీసుకుంటూనే కొత్త వారికి ప్రాధాన్యం కల్పించాలని సూచిస్తున్నారు. కానీ కిషన్ రెడ్డి వ్యాఖ్యలు తమను పక్కన పెట్టేసేలా ఉన్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రేపు ధాన్యం కొనుగోలు కేంద్రాల సందర్శన
సంస్థాగత ఎన్నికల కార్యశాలలో భాగంగా బీజేపీ కోర్ కమిటీ కీలక నిర్ణయాలను తీసుకున్నది. ప్రత్యేక కార్యాచరణను ఫిక్స్ చేసుకుంది. శనివారం బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల బృందం ధాన్యం కొనుగులు కేంద్రాలను సందర్శించనుంది. మూసీ పరివాహక ప్రాంత ప్రజల ఇండ్లలో బీజేపీ నేతల నిద్ర.. ఒక రోజు నైట్ అక్కడే బస చేయడంతో పాటు రాత్రి భోజనం, మరుసటి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ కూడా చేయాలని నిర్ణయించారు. అలాగే వచ్చేనెలలో ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. బీజేపీ సభ్యత్వాలతో పాటు సంస్థాగత ఎన్నికలపైనా పార్టీ దృష్టి సారించింది. ఈనెల 9, 10, 11 తేదీల్లో జిల్లాల్లో, ఈనెల 12, 13, 14 తేదీల్లో మండల స్థాయిలో వర్క్ షాప్స్ నిర్వహించాలని నిర్ణయించారు. 18, 19 ,20, అలాగే 24, 25 తేదీల్లో బీజేపీ బూత్ కమిటీ ఎన్నికలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు.