- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ కీలక నిర్ణయం
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం వెల్లడించింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్ల బీజేపీ పోటీ చేయబోతున్నట్టు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. బుధవారం సికింద్రాబాద్ లో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమ సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ 50 లక్షల సభ్యత్వాలను లక్ష్యంగా పెట్టుకుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఆర్థిక సంక్షోభంలో పడిపోయిందన్నారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు. ప్రజలు కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ కు ఓట్లు వేసి గెలిపించారు తప్ప కాంగ్రెస్ మీద ప్రేమ కాదన్నారు. జీహెచ్ఎంసీలో ఏర్పాటు చేసిన హైడ్రా అనేది ప్రజలను రుణమాఫీ నుండి దృష్టి మరల్చడానికి మాత్రమే అని కిషన్ రెడ్డి అన్నారు.
- Tags
- kishan reddy