పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు

by GSrikanth |
పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్​పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది ఎమ్మెల్యేల గెలుపుతో ఊపుతో ఉన్న పార్టీ.. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్​లోనూ సత్తా చాటాలని పట్టుదలతో ఉంది. ముందుగా పార్టీ కేడర్‌ను సమన్వయ పరుచుకుంటూ పార్లమెంట్ ఎన్నికలపై గెలుపే లక్ష్యంగా బీజేపీ ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా ఆదివారం ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నవ యువ ఓటర్ల కమిటీ, వికసిత్ భారత్ కమిటీ, శ్రీరామ మందిర దర్శన కమిటీ, లాభార్సి అభియాన్ కమిటీ, మహిళా, స్వచ్ఛంద సంస్థల కమిటీ, గావ్ చలో బస్తీ చలో తదితర కమిటీల సమావేశాలు వేరువేరుగా జరిగాయి.

నేడే సమావేశం :

రాబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా పార్లమెంటు సన్నాహక సమావేశాన్ని సోమవారం నిర్వహిచనున్నట్టు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అధ్యక్షత వహిస్తారు. అలాగే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇన్​ఛార్జ్​ సునీల్ బాన్సల్ కుడా పాల్గొని కార్యకర్తలకు, నాయకులకు దిశా నిర్దేశం చేయనున్నారు.

Next Story

Most Viewed