KTR vs BJP : కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్ ట్వీట్

by Ramesh N |
KTR vs BJP : కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రజలు ఈ సారి బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చారని, కానీ ఏం ప్రయోజనం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో కన్నా కూడా మనకు నిధుల్లో కోతలు పెట్టారన్నారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ మెట్రోకు ఎన్నోసార్లు నిధులు కావాలని అడిగితే పట్టించుకోలేదని గుర్తుచేశారు. ఇదే కేంద్రం హైదరాబాద్ మెట్రోను విస్మరిస్తూ మిగతా రాష్ట్రాల్లో మెట్రో ప్రాజెక్టులకు మాత్రం భారీగా నిధులు కేటాయిస్తుందని లెక్కలతో సహా కేటీఆర్ వివరించారు. దీనిపై తెలంగాణ బీజేపీ పార్టీ ట్విట్టర్ వేదికగా స్పందించింది. కేటీఆర్‌కు అబద్దాలు ఆడడం బాగా అలవాటు అయిందన్నారు. ఒకప్పుడు రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేవలం పదేళ్లలో దోచుకొని, దాచుకొని రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని పేర్కొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం మంజూరు చేసిన వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ సాధ్యమైందన్నారు.

అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం తన పదవీకాలంలో విమానాశ్రయ మెట్రో విస్తరణ ప్రాజెక్టుకు స్వతంత్రంగా నిధులు సమకూరుస్తుందని నొక్కి చెప్పిందని గుర్తుచేశారు. ఎన్నికలకు ముందు విస్తరణ కోసం వివరణాత్మక ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) విడుదల చేయబడిందని, అయితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మునుపటి డీపీఆర్‌ను తిరస్కరించి.. అలైన్‌మెంట్ మార్చిందని స్పష్టంచేశారు. దీనిపై గతంలో హైదరాబాద్ మెట్రో రైలు కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1.200 కోట్లు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అందించినట్లు గతంలో కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడిన వ్యాఖ్యలు చేసిన వీడియో షేర్ చేసింది.

Advertisement

Next Story