- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
'ఆ రైళ్లను వలిగొండలోనూ ఆపించండి'
by GSrikanth |

X
దిశ, భువనగిరి రూరల్: కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కి బీజేపీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు పీవీ శ్యామసుందర్ అధ్వర్యంలో వలిగొండ మండల నాయకులు వినతిపత్రం అందించారు. వలిగొండ రైల్వే స్టేషన్‌లో నారాయణద్రి, జన్మభూమి, నర్సాపూర్, విశాఖ, చెన్నయ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపడానికి అనుమతి ఇప్పించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. మండల కేంద్రంలో రైలు ఆపడం వలన ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని, అదేవిధంగా వివిధ ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులకు, వ్యాపారస్తులకు, ఉద్యోగులకు, రైతులకు సౌకర్యంగా ఉంటుందని మంత్రికి తెలియజేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు దంతూరి సత్తయ్య గౌడ్, సీనియర్ నాయకులు బందారపు లింగస్వామి, కర్నాటి ధనంజయ, మండల అధ్యక్షులు సుధాకర్ గౌడ్, బీజేవైఎం మండల అధ్యక్షులు రేగూరి అమరేందర్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Next Story