బూత్ లెవల్‌పై BJP ఫోకస్.. అన్ని వర్గాలకు రీచ్ అయ్యేలా స్పెషల్ ప్రోగ్రామ్స్

by Satheesh |
బూత్ లెవల్‌పై BJP ఫోకస్.. అన్ని వర్గాలకు రీచ్ అయ్యేలా స్పెషల్ ప్రోగ్రామ్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్న బీజేపీ.. బూత్ లెవల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. బూత్ స్థాయిలో పార్టీ బలోపేతానికి మార్చి 12 నుంచి 20వ తేదీ వరకు ‘బూత్ సశక్తికరణ్’ పేరిట 9 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నది. బూత్ కమిటీల నియామకం, కార్యకర్తల డేటాను అప్ డేట్ చేయడంతోపాటు నేతలకు పని విభజన చేయనున్నది. ప్రతి పోలింగ్ బూత్‌కు కార్యకర్తలు, ఓటర్లు ఉండేలా రెండు వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి, వారితో ఎల్లప్పుడూ టచ్‌లో ఉండేలా వ్యూహాన్ని రూపొందించింది.

సభ్యుల సంఖ్య పెంపు..

బూత్ కమిటీలో ప్రస్తుతం ఉన్న సభ్యుల సంఖ్యను 21 నుంచి 31కి పెంచాలని డిసైడ్ అయింది. ఇందులో 11 మందికి కీలక బాధ్యతలు నెరవేర్చాల్సి ఉండగా, మిగతా 20 మంది సభ్యులుగా ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఓటరు లిస్టులోని ఒక్కో పేజీకి పన్నా ప్రముఖ్‌ను నియమించాలని భావిస్తున్నది. బూత్ సశక్తికరణ్ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు మార్చి 3, 4, 5 తేదీల్లో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది.

చేపట్టనున్న పనులివే..

బూత్ లెవల్ కమిటీలో మొదట 11 మందిని తీసుకొని పని విభజన చేసి, ప్రజల్లోకి వెళ్లనున్నారు. వివరాలను సరళ్ యాప్‌లో ఎంట్రీ, వాట్సప్ గ్రూపులను క్రియేట్ చేయనున్నారు. అధిష్టానం దిశానిర్దేశం ప్రకారం బూత్‌లను ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించనున్నారు. ఓటరు జాబితా విశ్లేషణ, కొత్త ఓటర్లను నమోదుతోపాటు చేరికలపై కూడా ఫోకస్ పెట్టనున్నారు. బూత్ సశక్తికరణ్ ప్రోగ్రామ్స్ అనంతరం మార్చి 21 నుంచి 31 వరకు బూత్ స్థాయిలో డేటా ఎంట్రీ పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. బీజేపీ ప్రణాళికలు అమలు చేసేందుకు ప్రతి శక్తికేంద్రంలో కనీసం ఒక స్వల్పకాలిక విస్తారక్‌ను నియమించాలని జాతీయ నాయకత్వం సూచించింది.

Advertisement

Next Story

Most Viewed