- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాష్ట్రంలో వేడెక్కిన వాతావరణం.. బండి సంజయ్, రాజాసింగ్ అరెస్ట్
దిశ, ఘన్ పూర్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై తీవ్రంగా రియాక్టైన బీజేపీ నేతలు సోమవారం ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద భారీ నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వారిపై పోలీసులు, టీఆర్ఎస్ నేతలు ఎదురు దాడికి దిగారు. ఈ దాడికి నిరసనగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు టీ-బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో బస చేసిన చోటే దీక్షకు సిద్ధమవుతుండగా ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ పోలీసులు, బీజేపీ నేతల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. అధికార పార్టీ నేతలు చేస్తోన్న అక్రమాలను ప్రశ్నిస్తే.. అరెస్ట్ చేయడమేంటని బీజేపీ శ్రేణులు పోలీసులు తీరుపై మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా.. మరో పక్కా మహ్మద్ ప్రవక్తపై వివాదస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.