- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్సీ కవిత, స్మితా సబర్వాల్‌పై రఘునందన్ రావు సీరియస్
దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం కల్లెడ గ్రామ తాజా, మాజీ సర్పంచ్ లావణ్య గౌడ్ మంగళవారం ఆత్మహత్యాయత్నం చేశారు. గ్రామ అభివృద్ధి కోసం చేసిన బిల్లులు రాకపోవడం, వాటి కోసం చేసిన అప్పులు తీర్చే దారిలేకపోవడం, డబ్బులిచ్చిన వారి నుంచి ఒత్తిడి, సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేయడం, ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో తన భర్త ప్రసాద్ గౌడ్ జైలుకు వెళ్లడం వంటి కారణాలతో మానసికంగా కుంగిపోయిన ఆమె నిద్రమాత్రలు మింగి సూసైడ్ అటెంప్ట్ చేశారని స్థానికులు చెబుతున్నారు. తాజాగా.. ఈ ఘటనపై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు స్పందించారు.
ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్సీ కవిత, సీఎంఓ అధికారి స్మితా సబర్వాల్‌పై సీరియస్ అయ్యారు. ‘రాష్ట్రంలో రోజు రోజుకు మహిళలపై లైగింక వేధింపులు, దాడులు పెరుగిపోతున్నాయి. నిధులు రాక అప్పుల బాధతో, అవమానం భరించలేక మహిళ సర్పంచ్ ఆత్మహత్యా యత్నం చేసుకున్నది. మహిళా బిల్లు, మహిళపైనా కపట ప్రేమ చూపించే ఎమ్మెల్సీ కవిత గారికి ఇవి కనిపించవా?? మహిళల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇంత వివక్ష?? పక్క రాష్ట్రంలో స్పందించే స్మితా సబర్వాల్, మహిళా కమిషనర్ సునీతా రెడ్డి గారు ఎందుకు ఈ మౌనం?? దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం వేంటనే స్పందించాలి!!’ అని రఘునందన్ రావు ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.