- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జహీరాబాద్ అభ్యర్థిని మార్చండి.. కిషన్ రెడ్డి చుట్టుముట్టిన సొంత నేతలు
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. జహీరాబాద్ టికెట్ మాజీ మంత్రి బాగారెడ్డి తనయుడు జైపాల్ రెడ్డి అనుచరులు నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆందోళనకు దిగారు. ఫెయిల్యూర్ ఎంపీ తమకొద్దని, ఆయన్ను ఎలా పార్టీలో చేర్చుకున్నారంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. జహీరాబాద్ టికెట్ బీబీ పాటిల్‌కు ఇస్తారన్న హామీతోనే చేర్చుకున్నారని, పాటిల్ ఫెయిల్యూర్ ఎంపీ అని, ఆయనకు టికెట్ ఇవ్వొద్దని నినాదాలు చేశారు.
పాటిల్‌కి టికెట్ ఇస్తే బీజేపీకి మూడో స్థానమేనని వారు వాపోయారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోగానే జహీరాబాద్ పార్లమెంట్‌కు చెందిన బీజేపీ నేతలు ఆయన్ను చుట్టుముట్టారు. ప్లకార్డులతో నిరసనకు దిగారు. దీంతో ఎమ్మెల్యే క్వార్టర్స్‌కి రావాలని కిషన్ రెడ్డి వారికి సూచించారు. దాంతో వారు నిరసన విరమించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.