ఒక మహిళ లిక్కర్ స్కాంలో ఉండడమేంటి..? విజయశాంతి ఫైర్

by Satheesh |   ( Updated:2022-08-24 08:04:56.0  )
ఒక మహిళ లిక్కర్ స్కాంలో ఉండడమేంటి..? విజయశాంతి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. ఈ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత ఉందంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా బీజేపీ మహిళా నేత విజయశాంతి ఎమ్మెల్సీ కవితపై ఫైర్ అయ్యారు. ఒక లిక్కర్ స్కాంలో మహిళా ఉండడమేంటని ఆమె ప్రశ్నించారు. కల్వకుంట్ల కవిత కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్రం నుండి వెలివేయాలని అన్నారు. సీఎం కేసీఆర్‌ను సరైన సమయంలో ఈడీ పిలుస్తోందని హెచ్చరించారు. తెలంగాణలో మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed