- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'సర్వే పూర్తయింది.. తెలంగాణలో BJP గెలిచే స్థానాలివే'
దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే ఎన్నికల్లో బీజేపీ అద్భుతమైన మెజార్టీతో గెలవడం తథ్యమని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ చుగ్ అన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించినట్లు ఆయన చెప్పారు. బీజేపీ కనీసం అభ్యర్థులను ప్రకటించకముందే 78 స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని సర్వే రిపోర్ట్ వచ్చిందని, అలాంటిది అభ్యర్థులను ప్రకటిస్తే కనీసం 90 సీట్లు వస్తాయని సర్వేల్లో తేలిందని కామెంట్లు చేశారు. ఈ విషయం ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి వెళ్లడంతో ఆయనకు గుబులు పుట్టిందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని, ప్రతీ ఒక్కరూ కష్టపడి పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని రాష్ట్ర పధాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇంచార్జీల సమావేశంలో తరుణ్ చుగ్ నొక్కి చెప్పారు.