- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికారికంగా MLA సాయన్న అంత్యక్రియలు.. BRS సర్కార్‌పై బీజేపీ ఆగ్రహం
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ప్రభుత్వం అడుగడుగునా దళితులను వంచిస్తోందని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరపకపోవడంపై రామచంద్రరావు మండిపడ్డారు. దళితులను ఇంతలా దగా చేసిన ప్రభుత్వం మరొకటి లేదని, రాష్ట్రం ఏర్పడితే తొలి ముఖ్యమంత్రి దళితుడే అని ఓట్లు దండుకుని దగా చేశారని ధ్వజమెత్తారు. దళితులకు ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి పదవిని సైతం తొలగించారని ఓ వైపు దళితులను దగా చేస్తునే మరో వైపు దళిత నాయకులకు కనీస గౌరవం ఇవ్వడం లేదని ఆరోపించారు.
కాగా, సాయన్న అంత్యక్రియలను అధికారికంగా జరపకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అంతకు ముందు సాయన్న మృతదేహాం వద్ద వెళ్లి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి, మంత్రులు, బీఆర్ఎస్ నేతలు గొప్ప మాటలే చెప్పారు కానీ చేతల విషయానికి వచ్చే సరికి అవమానకరంగా వ్యవహరించారని సాయన్న అభిమానులు, దళిత నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. సుదీర్ఘ కాలం పాటు ఎమ్మెల్యేగా కొనసాగిన సాయన్న విషయంలో ప్రభుత్వం అనుసరించిన వైఖరి సరికాదని మండిపడుతున్నారు.