- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు ఖాయం: ఈటల కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: మరికొన్ని నెలల్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలపై టీ బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తెలంగాణ, మిజోరం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధించిందని అన్నారు. బీజేపీ తెలంగాణలో గతం కంటే పుంజుకోగా.. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను గద్దె దించి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని తెలిపారు. మధ్యప్రదేశ్‌లో భారీ మెజార్టీతో గెలిచి.. మరోసారి ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నదన్నారు. అంతేకాకుండా మరికొన్ని రోజుల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు సాధిస్తుందని జోస్యం చెప్పారు. తెలంగాణలో ఉన్న 17 పార్లమెంట్ స్థానాలను కూడా బీజేపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయం అన్నారు. కాగా, ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల రాజేందర్ సొంత ఇలాకా హుజురాబాద్‌తో పాటు.. గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేశారు. ఊహించని విధంగా ఈటల రాజేందర్ రెండు చోట్ల ఓటమి పాలయ్యారు.