- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అడ్డగోలుగా వందల ఫ్లోర్లకు అనుమతి ఇచ్చేది అందుకే: DK Aruna
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లో పెద్ద భవంతుల నిర్మాణం జరుగుతుందంటే అందులో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి భాగస్వామ్యం ఉన్నట్లేనని, వందల ఫ్లోర్లకు అడ్డగోలుగా అనుమతి ఇచ్చి భాగస్వామ్యం తీసుకుంటున్నారని బీజేపీ నాయకురాలు డీకే అరుణ ఫైరయ్యారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. వారం పది రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయని, చాలామంది గల్లంతయ్యారని, రోడ్లు కొట్టుకుపోయాయన్నారు. హైవేలు, వంతెనల పైనుంచి నీరు ప్రవహిస్తోందన్నారు. ప్రధానంగా భూపాలపల్లి, ములుగు, వరంగల్, జనగామ ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయని, ప్రజల కష్టాలు చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణలో దాదాపు 5 లక్షల ఎకరాల పంట నీట మునిగిందని ఆమె వెల్లడించారు. దాదాపు 40 వేల కుటుంబాలు కట్టు బట్టలతో ఇల్లు వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం సమీక్ష కూడా నిర్వహించకపోవడం దారుణమని ఆమె మండిపడ్డారు. భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని డీకే అరుణ ధ్వజమెత్తారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం చేతులెత్తేశారని ఫైరయ్యారు. రెండేళ్లుగా ఇలాంటి వర్షాలతో ప్రజలు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నా సర్కార్ గుణపాఠం నేర్చుకోలేదని ఆమె ధ్వజమెత్తారు. వరంగల్‌లో నీళ్లు ఉన్నాయా? నీళ్లలో వరంగల్ ఉందా..? అనే అనుమానం కలుగుతోందని ఆమె వ్యాఖ్యానించారు. వరంగల్‌లోనే దాదాపు 150 కాలనీలు నీట మునిగాయని, గతంలో నీట మునిగిన ఇండ్లకు రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి కూడా కేవలం ఎలక్షన్ ఉందనే కారణంగా రూ.10 వేలు ఇచ్చారని, మరి ఇప్పుడు అంతకంటే భారీ వర్షంతో ఇండ్లు నీట మునిగినా పరిహారం ఎందుకు ఇవ్వడంలేదని ఆమె ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికైనా సమీక్ష నిర్వహించి ఎంత పంట నష్టపోయింది? ఎన్ని ఇండ్లు మునిగాయి? ఎందరు చనిపోయారు? ఎందరు గల్లంతయ్యారనే వివరాలు తెలిసుకుని సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వరంగల్‌ను డల్లాస్ చేస్తానని చెప్పి ఖల్లాస్ చేశారని డీకే అరుణ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి చాలా అధ్వాన్నంగా తయారైందని మండిపడ్డారు.