- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BJP AAKARSH: లోక్‌సభ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీజేపీలోకి పటేల్ రమేష్‌రెడ్డి!
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి సూర్యాపేట ఎమ్మెల్యే టికెట్ ఆశించిన పటేల్ రమేష్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మరోసారి మైండ్‌బ్లాంక్ అయ్యే షాకిచ్చింది. ఇప్పటికే ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన ఆయనకు కాంగ్రెస్ పెద్దలు కీలక హామీ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడంతో పాటు బాండ్ పేపర్ కూడా రాసిచ్చారు. సీన్ కట్ చేస్తే.. ఇవాళ కాంగ్రెస్ నుంచి లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను ఇవాళ ఏఐసీసీ విడుదల చేసిన చేసింది. ఈ మేరకు ఆ జాబితాలో నల్గొండ ఎంపీ టికెట్‌ను జానారెడ్డి పెద్ద కుమారుడు రఘువీర్‌రెడ్డికి కేటాయించింది. దీంతో సీన్ ఒక్కసారిగా రివర్స్ అయింది.
ఇన్నాళ్లు అదే టికెట్‌పై ఆశలు పెట్టుకున్న పటేల్ రమేష్‌రెడ్డికి మళ్లీ నిరాశే ఎదరైంది. ఈ క్రమంలో ఆయన పక్కాగా పార్టీ మారుతారనే ప్రచారం ఊపందుకుంది. తన సహచరులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో చర్చించి బీజేపీలో చేరేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. నల్గొండ జిల్లాలో బలహీనంగా ఉన్న బీజేపీ.. పటేల్ రమేష్‌రెడ్డిని తమ పార్టీలోకి చేర్చుకుంటే బలం పెరుగుతుందని రాష్ట్ర బీజేపీ నేతలు ఇప్పటికే ఢిల్లీ పెద్దలకు సమాచారం అందజేశారు. అందుకు బీజేపీ అధిష్టానం కూడా పటేల్ రమేష్‌రెడ్డి చేరికకు ఓకే చెప్పారని టాక్. ఒకవేళ ఆయన బీజేపీలో చేరితే.. నల్గొండ ఎంపీ టికెట్ ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి పటేల్ రమేష్ రెడ్డి బీజేపీలో చేరుతారా.. లేక కాంగ్రెస్‌లోనే ఉంటూ అవమానాలను భరిస్తారా.. అనేది హాట్ టాపిక్‌గా మారింది.