రేవంత్ రెడ్డిది క్యాష్ అండ్ క్యారీ పాలసీ.. BJLP నేత ఏలేటి సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 4 |
రేవంత్ రెడ్డిది క్యాష్ అండ్ క్యారీ పాలసీ.. BJLP నేత ఏలేటి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డిపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు. బిల్డర్ల నుంచి ఆర్ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. చదరపు అడుగుకు రేట్ కట్టి వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. బిల్డర్ల నుంచి నేరుగా డబ్బులే వసూలు చేస్తున్నారన్నారు. ఆర్ఆర్ఆర్ అంటే రాహుల్, రేవంత్, రియల్ ఎస్టేట్ దందా అన్నారు. ఏడాది కడుపు కట్టుకుంటే రూ.40 వేల కోట్ల దోపిడీ ఆపి.. రుణమాఫీ చేస్తానని రేవంత్ బహిరంగంగానే చెబుతున్నారని గుర్తు చేశారు.

ఎక్కడెక్కడ అవినీతి చేయొచ్చో సీఎం రేవంత్ రిసెర్చ్ చేశారన్నారు. హైదరాబాద్ అంటే సెటిల్మెంట్ అనేలా వ్యవహరించడంతో రియల్టర్లు భయపడుతున్నారన్నారు. గత ప్రభుత్వంలో కేటీఆర్ రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి ఫ్లోర్లు, ఫ్లాట్లు, జాగాలు అడిగితే రేవంత్ రెడ్డి ఏకంగా తనకు ఢిల్లీకి డబ్బులు పంపేది ఉందని చెప్పి క్యాష్ అండ్ క్యారీ అంటున్నారని ఏలేటి ఆరోపించారు. ఢిల్లీ షెహన్ షాలకు కిస్తులు కట్టాలని వసూళ్లకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు.

Read More..

కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి!.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ డిమాండ్

Next Story

Most Viewed