- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLA దానం ఎపిసోడ్‌లో మరో బిగ్ ట్విస్ట్.. ఉచ్చు బిగిస్తోన్న బీజేపీ..!
దిశ, వెబ్‌డెస్క్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు వ్యవహారం స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి అధికార కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే గులాబీ నేతలు స్పీకర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు తెలంగాణ హైకోర్టును సైతం ఆశ్రయించారు. ఇదిలా ఉండగానే, దానం పార్టీ ఫిరాయింపు ఎపిసోడ్‌లో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ శాసన సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే దానంపై అనర్హత వేటు వేయాలని స్పీడ్ పోస్ట్‌లో అసెంబ్లీ స్పీకర్‌కు బీజేపీ ఎల్పీ పిటిషన్ పంపింది. అయితే, స్పీడ్ పోస్టులో వచ్చిన ఈ పిటిషన్‌ను స్పీకర్ కార్యాలయం స్వీకరించలేదని సమాచారం. దీంతో బీజేపీ ఎల్పీ పంపిన అనర్హత పిటిషన్ రిటర్న్ వచ్చినట్లు తెలుస్తోంది.
స్పీకర్ అనర్హత పిటిషన్ స్వీకరించకపోవడంతో దానం ఫిరాయింపు ఇష్యూపై హైకోర్టును ఆశ్రయించాలని బీజేపీ డిసైడ్ అయినట్లు టాక్. ఈ మేరకు సోమవారం హై కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని కాషాయ పార్టీ యోచిస్తున్నట్లు సమాచారం. దానంపై ఫిరాయింపుపై ఓ వైపు బీఆర్ఎస్ దూకుడుగా వెళ్తుంటే.. మరోవైపు బీజేపీ సైతం ఈ ఇష్యూను సీరియస్‌గా తీసుకోవడం స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన దానం.. అనంతరం గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి చేతిలో దానం ఓటమి పాలయ్యారు.