- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కాంగ్రెస్‌లో చేరడానికి ముందే కడియం శ్రీహరికి BIG షాక్
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ కీలక నేత, ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరిక వ్యవహారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దుమారం రేపుతోంది. పార్టీని ఆపత్కాలంలో వదిలేసి స్వార్థం కోసం వీడుతున్నారని అటు బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతుండగా.. చేరికను వ్యతిరేకిస్తూ ఇటు కాంగ్రెస్ శ్రేణులు ఐకమత్యం అవుతున్నారు. ముఖ్యంగా శ్రీహరి సొంత నియోజకవర్గమైన స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఆ పార్టీ శ్రేణుల నుంచి నిరసన వ్యక్తం అవుతున్నది. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్న కడియం శ్రీహరిని కాంగ్రెస్‌లో చేర్చుకోవద్దంటూ ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి సింగపురం ఇందిర అధిష్టానానికి సూచనలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆమె వివిధ మండలాల ముఖ్యనాయకులు, కార్యకర్తలతో శుక్రవారం హైదరాబాద్ వెళ్లి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీకి కడియంపై ఫిర్యాదు చేశారు. 30 ఏండ్లుగా శ్రీహరి నియంతృత్వ ధోరణి వల్ల పార్టీ ఎంత నష్టపోయిందని.. ఆయన ఇబ్బందులు పెట్టినా పార్టీని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. రానున్న 2 రోజుల్లో వేలాది మంది కార్యకర్తలతో నియోజకవర్గంలో భారీ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కడియం శ్రీహరి చేరికను ఏ విధంగా వ్యతికిరేస్తున్నారో అధిష్టానానికి తెలిసే విధంగా సభ నిర్వహిస్తామని అన్నారు. కార్యకర్తలు ఎవరూ అధైర్య పడొద్దని తాను అండగా ఉంటానని సింగాపూరం ఇందిర హామీ ఇచ్చారు. ఈ పరిణామాలపై కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
కడియం శ్రీహరి చేరికను వ్యతిరేకిస్తున్న స్టేషన్ ఘన్పూర్ కాంగ్రెస్ కార్యకర్తలు
— Telugu Scribe (@TeluguScribe) March 30, 2024
స్టేషన్ ఘన్పూర్ కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమైన సింగాపూరం ఇందిర.
30 సంవత్సరాల నుండి కడియం శ్రీహరి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేశాడని దీపాదాస్ మున్షీతో కలిసి చెప్పిన స్టేషన్ ఘన్పూర్ ఇంఛార్జి సింగాపూరం… pic.twitter.com/Y6NtMtZ65Y