మరో BRS మాజీ ఎమ్మెల్యేకు బిగ్ షాక్!

by Rajesh |
మరో BRS మాజీ ఎమ్మెల్యేకు బిగ్ షాక్!
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు వరుస షాక్‌లు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుటుంబ సభ్యులకు చెందిన రైస్ మిల్లుల్లో ఆఫీసర్లు రైడ్ చేశారు. రూ.70 కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. రూ.9 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉన్నందున పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల నిజామాబాద్ జిల్లాకే చెందిన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్టీసీ కాంప్లెక్స్ అద్దె బకాయిలు, కరెంట్ ఛార్జీల బకాయిల విషయంలో అధికారులు షాక్ ఇచ్చారు. తాజాగా ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తీసుకున్న రుణానికి వడ్డీతో కలిపి రూ.45 కోట్లు చెల్లించాలని నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని బీఆర్ఎస్ నేతల్లో గుబులు మొదలైంది.

Advertisement

Next Story