మంత్రి గంగులకు బిగ్ రిలీఫ్! ఆ పిటిషన్ కొట్టివేత..

by Sathputhe Rajesh |   ( Updated:2023-11-08 06:44:40.0  )
మంత్రి గంగులకు బిగ్ రిలీఫ్! ఆ పిటిషన్ కొట్టివేత..
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. గంగుల ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వేసిన పిటిషన్‌ను హై కోర్టు బుధవారం కొట్టివేసింది. గంగుల కమలాకర్ ఎన్నికల చెల్లదంటూ పొన్నం వేసిన పిటిషన్‌‌పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. 2018లో పొన్నం ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఎన్నికల్లో పరిమితికి మించి గంగుల ఖర్చు చేశారని పొన్నం ప్రభాకర్ పిటిషన్‌లో పేర్కొన్నారు. సరైన ఆధారాలు లేవని పిటిషన్‌ను హై‌కోర్టు తాజాగా కొట్టివేసింది. మరో వైపు గంగుల ఎన్నికను రద్దు చేయాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు గురువారం విచారణ చేపట్టనుంది.

Advertisement

Next Story

Most Viewed